- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లిపై ఓపెన్ అయిన ఆషికా రంగనాథ్.. అలాంటి క్వాలిటీస్ ఉన్నవాడే కావాలి!
‘అమిగోస్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కన్నడ భామ ఆషికా రంగనాథ్(Ashika Ranganath).

దిశ, సినిమా: ‘అమిగోస్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కన్నడ భామ ఆషికా రంగనాథ్(Ashika Ranganath). ఆ తర్వాత వచ్చిన ‘నా సామిరంగ’తో సూపర్ హిట్ అందుకుని తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఆమె కెరీర్ పూర్తిగా టర్న్ తీసుకుందని చెప్పాలి. సహజమైన నటన, గ్లామర్‌తో పాటు సంప్రదాయ లుక్‌లోనూ ఆకట్టుకునే ఆషికాకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. వరుసగా ఆఫర్లు రావడంతో టాలీవుడ్‌లో ఆమె బిజీ హీరోయిన్‌గా మారుతోంది. గత ఏడాది ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, ఆ ప్రభావం ఆమె కెరీర్‌పై పెద్దగా పడలేదు. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. ముఖ్యంగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi)సినిమాలో కీలక పాత్రలో అవకాశం దక్కించుకోవడం విశేషం. ఇందులో రవితేజ సరసన ఆషికా రొమాన్స్ చేయనుండగా, మరో హీరోయిన్‌గా డింపుల్ హయాతీ కూడా నటిస్తోంది.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆషికా రంగనాథ్ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నన్ను గౌరవించే వ్యక్తి కావాలి, నా కెరీర్‌ను అర్థం చేసుకుని సపోర్ట్ చేసే మనసుండాలి. నటన నా ప్యాషన్.. దాన్ని కొనసాగించేందుకు ప్రోత్సహించే వ్యక్తి అయితే చాలు” అంటూ చెప్పింది. అంతేకాదు, లైఫ్ పార్ట్‌నర్ విషయంలో లుక్స్ కంటే మెంటాలిటీ, నిజాయితీ, బాధ్యత ఎక్కువ ముఖ్యమని స్పష్టం చేసింది.
కుటుంబాన్ని విలువలతో చూసే వ్యక్తి కావాలన్న ఆమె మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తన జీవిత భాగస్వామి కేరింగ్‌గా, లవింగ్‌గా తనను చూసుకునే వ్యక్తి కావాలని, చిన్న చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ చూపించే మనసుండాలని చెప్పింది. అంతేకాకుండా భర్త క్లీన్ హ్యాబిట్స్ కలిగి ఉండాలని కూడా చెప్పింది. పరిశుభ్రత విషయంలో రాజీపడనని, వ్యక్తిత్వాన్ని అది చాలా వరకు ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడింది. నేను చూసిన వారిలో కళ్యాణ్ రామ్ హస్గెండ్ మెటీరియల్ అని చెప్పింది. ఇప్పట్లో పెళ్లిపై తొందరేమీ లేదని, కెరీర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టానని కూడా ఆషికా క్లారిటీ ఇచ్చింది.
Read More..
బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన రేణు దేశాయ్.. ఒడిలో పసిబిడ్డతో దర్శనమిచ్చి షాకిచ్చిందిగా!
ప్రభాస్ చేసిన పనికి సెట్‌లో కంట్రోల్‌లో ఉండలేకపోయాను.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్






