- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన రేణు దేశాయ్.. ఒడిలో పసిబిడ్డతో దర్శనమిచ్చి షాకిచ్చిందిగా!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) మరోసారి తన కెరీర్‌కు కొత్త ఊపునిచ్చే ప్రయత్నం చేస్తోంది.

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) మరోసారి తన కెరీర్‌కు కొత్త ఊపునిచ్చే ప్రయత్నం చేస్తోంది. ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాతో చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలు, వ్యక్తిగత క్షణాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో సెకండ్ ఇన్నింగ్స్‌ను గట్టిగా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా రేణు దేశాయ్ అభిమానులకు ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ‘పదహారు రోజుల పండుగ’ అనే కొత్త చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో సాయి కిరణ్ అడివి హీరోగా నటిస్తుండగా, షూటింగ్ కూడా ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. దర్శక, నట బృందంతో కలిసి ఓ వీడియోను షేర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
గుడ్ న్యూస్
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇదే సమయంలో రేణు దేశాయ్ చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఒడిలో ఓ చిన్నారి ఉండగా తీసిన ఫొటోను షేర్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఫొటోకు “పసిపిల్లలు తమ రెక్కలను దాచుకున్న దేవదూతల లాంటివారు.. ఈ చిన్నారి తన ముద్దులొలికే రూపంతో నా హృదయాన్ని దోచుకున్నాడు” అనే భావోద్వేగ క్యాప్షన్ జత చేసింది. అయితే ఆ పోస్టుకు కామెంట్స్ ఆఫ్ చేయడం మరింత చర్చకు దారి తీసింది. అంతేకాకుండా అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఆ చిన్నారి ఎవరు? రేణు దేశాయ్‌కు ఏ విధంగా సంబంధించినవారు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఒకవైపు సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్లాన్ చేస్తూనే, మరోవైపు ఇలాంటి భావోద్వేగ పోస్టులతో రేణు దేశాయ్ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు.






