- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ క్రేజీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన నివేతా పేతురాజ్
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ‘సింగ్ గీతం’ చిత్రంలో నివేతా పేతురాజ్‌కు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నివేతా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె కొన్ని విజయాలతో మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. అయితే ఇటీవల కాలంలో సినిమాల విషయంలో కాస్త స్లో అయిన ఈ భామకు ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం వచ్చినట్లు సమాచారం. టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ‘సింగ్ గీతం’ చిత్రంలో నివేతా పేతురాజ్ కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది. 94 ఏళ్ల వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.






