Nidhhi Agerwal: ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేశ ప్ర‌ధాన మంత్రి అవుతాడు!

by velandi.Saikiran |   (  Updated:2026-01-21 06:04:36  IST  )

విష్యత్తులో పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అయినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు నిధి అగర్వాల్.

Nidhhi Agerwal: ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేశ ప్ర‌ధాన మంత్రి అవుతాడు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ నిధి అగర్వాల్. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి బడా హీరోలతో ఆమె సినిమాలు చేసి దూసుకు వెళ్తున్నారు. త్వరలోనే మరో మూడు కొత్త ప్రాజెక్టులలో కూడా నిధి అగర్వాల్ నటించబోతున్నారు. అయితే అలాంటి నిధి అగర్వాల్, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ది రాజా సాబ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నిధి అగర్వాల్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ప్రశంసల వర్షం కురిపించారు.

పవన్ కళ్యాణ్ చాలా గట్స్ ఉన్న రాజకీయ నాయకుడు అంటూ కితాబు ఇచ్చారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అయినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు నిధి అగర్వాల్. ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుంటుందన్నారు. పార్టీని పెట్టి ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఇక ప్రభాస్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. PR టీం లేకుండానే ప్రభాస్ ముందుకు వెళ్తున్నారు... ఆయనంటే తనకు ఎంతో ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో నిధి అగర్వాల్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ది రాజా సాబ్ సినిమాతో మెరిసిన నిధి

ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ నటించి మెప్పించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. జనాలకు పెద్దగా ఎక్కలేదు. అటు నిధి చేసిన హరిహర వీరమల్లు సినిమా కూడా తేలిపోయింది.

Read More..

మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Next Story