- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రణవీర్‌పై నిషేదం ఎత్తివేత.. అఫీషియల్‌గా ప్రకటించిన FWICE
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌పై సినీ కార్మిక సంఘం FWICE నిషేధం విధించిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌పై సినీ కార్మిక సంఘం FWICE నిషేధం విధించిన విషయం తెలిసిందే. డాన్-3 నుంచి ఆయన సడెన్‌గా తప్పుకోవడంతో నిర్మాతలకు కోట్లలో నష్టం వచ్చిందంటూ ఆరోపించిన సదరు సంస్థ రణవీర్‌పై నిషేదం విధించింది. తాజాగా ఈ వివాదంపై రణవీర్ కోర్టును ఆశ్రయించి FWICE సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఈ క్రమంలోనే రణవీర్ సింగ్‌పై విధించిన నాన్ కో-ఆపరేషన్ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు FWICE (ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సంస్థ అధ్యక్షుడు బీఎన్ తివారీ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ మేరకు FWICE చీఫ్ అడ్వైజర్, ఫిల్మ్‌మేరకు అశోక్ పండిట్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని రణవీర్ కోరారు. ఈ అంశంపై చిత్ర బృందంతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని రణవీర్‌కు విజ్ఞప్తి చేశాము. దీనిపై ఆయన నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాము. ఇక ఆండస్ట్రీలో ఎవరిపైనా నిషేధం విధించే హక్కు మాకు లేదు’ అంటూ స్పష్టం చేశారు. దీంతో కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన రణవీర్ సింగ్ నిషేధం అంశంపై ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు అయింది.
హోదా పెరిగేకొద్దీ శత్రువులు వస్తారు.. రణవీర్‌ను నిషేదించడంపై కంగన కామెంట్స్
- Tags
- ranveer singh






