హోదా పెరిగేకొద్దీ శత్రువులు వస్తారు.. రణవీర్‌ను నిషేదించడంపై కంగన కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2026-06-03 09:38:06  IST  )

‘భారత్ భాగ్య విధాత’ అనే పవర్‌ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.

హోదా పెరిగేకొద్దీ శత్రువులు వస్తారు.. రణవీర్‌ను నిషేదించడంపై కంగన కామెంట్స్
X

దిశ, సినిమా: ‘భారత్ భాగ్య విధాత’ అనే పవర్‌ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. మనోజ్ తపాడియా రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రధానంగా భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన 26/11 ముంబై ఉగ్రదాడుల చుట్టూ తిరుగుతుంది. ఆ రాత్రి కామా అండ్ ఆల్‌బ్లెస్ హాస్పటల్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కంగన నర్సు పాత్రలో నటిస్తుంది. PEN స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రం జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్‌కు రాబోతున్నది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కంగనకు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌పై నిషేదంపై ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ.. ‘నన్ను అందరూ నిషేధించారు. కానీ ఇప్పుడు మీరు రణవీర్ సింగ్‌పై నిషేధం గురించి నన్ను అడుగుతున్నారు. ఇలాంటి విషయంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అన్ని వేళలా సాఫీగా నడవలేము. పర్వాలేదు.. చివరికి అంతా సవ్యంగానే సాగుతుంది. ముఖ్యంగా మన స్థాయి పెరిగేకొద్దీ, శత్రువులు పుట్టుకొస్తూనే ఉంటారు. కాబట్టి హోదా పెరిగి, శత్రువులు పెరగొద్దు అంటే అది సాధ్యం కాదు. నిజానికి ఇది మంచి విషయమే. అందుకే రణవీర్ తన సొంత హోదా గురించి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన హోదా పెరిగేకొద్ది శత్రువులు పెరుగుతారు’ అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చింది కంగన.

Next Story