NBK111: గ్యాంగ్‌స్టర్ డ్రామా కాదు.. అసలు ఎలా ఉండబోతోందో తెలుసా?

by Pulgam srinivas |   (  Updated:2026-06-01 06:22:52  IST  )

ముంబై అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్‌గా కాకుండా దేశభక్తుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

NBK111: గ్యాంగ్‌స్టర్ డ్రామా కాదు.. అసలు ఎలా ఉండబోతోందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పటివరకు అధికారికంగా టైటిల్ ఖరారు కాలేదు. అందువల్ల తాత్కాలికంగా ‘NBK111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇది ముంబై బేస్డ్ గ్యాంగ్‌స్టర్ కథ అని, బాలకృష్ణ ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించరని తెలుస్తోంది. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ కథలో దేశభక్తి ప్రధాన హైలైట్‌గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఈ తరహా జోనర్‌లో వచ్చిన సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఈ చిత్రంపై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ సింగిల్ రోల్‌లోనే కనిపించనున్నారని సమాచారం. ఇది కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

స్పిరిట్ కోసం మైత్రి థియేటర్.. అలాంటి సీన్ ఉండనుందా?

Next Story