స్పిరిట్ కోసం మైత్రి థియేటర్.. అలాంటి సీన్ ఉండనుందా?

by Pulgam srinivas |   (  Updated:2026-06-01 06:21:53  IST  )

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లోని మైత్రి విమల్ థియేటర్‌లో జరగనున్నట్లు సమాచారం.

స్పిరిట్ కోసం మైత్రి థియేటర్.. అలాంటి సీన్ ఉండనుందా?
X

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభమైన తర్వాత విడుదలైన ఒక్క పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు హైదరాబాద్‌లోని మైత్రి విమల్ థియేటర్‌లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా థియేటర్లలో షూటింగ్ అంటే మరో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు లేదా యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుంటారు. దీంతో స్పిరిట్ చిత్రంలో కూడా అలాంటి కీలక సన్నివేశం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా త్రిప్తి దిమ్రి నటించనుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీ-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

NBK111: గ్యాంగ్‌స్టర్ డ్రామా కాదు.. అసలు ఎలా ఉండబోతోందో తెలుసా?

Next Story