- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NBK 111: ముంబై బయలుదేరనున్న యూనిట్.. సాలిడ్ అప్డేట్ రెడీ చేస్తున్న మేకర్స్
బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ‘NBK 111’ టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం NBK 111 సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించబోతున్నారు. ‘పెద్ది’ చిత్రంతో నిర్మాతగా ప్రయాణాన్ని ప్రారంభించిన వెంకట సతీష్ కిలారు 'వృద్ధి సినిమాస్' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్డేట్‌తో పాటు మరో క్రేజీ న్యూస్ కూడా వైరల్‌గా మారింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం నెక్స్ట్ షెడ్యూల్‌ను ముంబైలో జూన్ 7వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు, ప్రస్తుతం అందుకు అనుగుణంగా పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘వీరసింహారెడ్డి’ చిత్రం తర్వాత బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.






