‘గాడ్ ఆఫ్ వార్’ గ్లింప్స్ వచ్చేది అప్పుడే?

by Pulgam srinivas |   (  Updated:2026-05-22 06:24:35  IST  )

‘గాడ్ ఆఫ్ వార్’ గ్లింప్స్‌ను జూన్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

‘గాడ్ ఆఫ్ వార్’ గ్లింప్స్ వచ్చేది అప్పుడే?
X

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే చిత్రం తెరకెక్కనున్నట్లు, ఆ సినిమాను నాగ వంశీ నిర్మించనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగినా, మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ చిత్రాన్ని నిర్మించనున్న నాగ వంశీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, “త్వరలోనే ‘గాడ్ ఆఫ్ వార్’ సెట్లో మా అభిమాన హీరోని కలుసుకుంటాం” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్టేనని అభిమానులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను జూన్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం తారక్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమాలో హీరోగా నటిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్‌తో ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ ఇద్దరూ తమ ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ‘గాడ్ ఆఫ్ వార్’ను ప్రారంభిస్తారా? లేక ఒకేసారి రెండు సినిమాలపై దృష్టి పెడతారా? అన్నది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

NBK 111: ముంబై బయలుదేరనున్న యూనిట్.. సాలిడ్ అప్డేట్ రెడీ చేస్తున్న మేకర్స్

Next Story