బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నేచురల్ బ్యూటీ.. ఏక్ దిన్ ఫస్ట్ లుక్ వైరల్

by I. Sairam |   (  Updated:2026-01-16 04:30:24  IST  )

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఫిదా మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నేచురల్ బ్యూటీ.. ఏక్ దిన్ ఫస్ట్ లుక్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఫిదా మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఇక చివరగా తండేల్ మూవీతో భారీ హిట్ సాధించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రజెంట్ రామాయణ్ మూవీలో యాక్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న భారీ రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దిన్’ చిత్రంలో యాక్ట్ చేస్తుంది. అయితే తాజాగా ఈ మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్.

జపాన్ లోని మంచు కురిసే అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, సాయి పల్లవి మరియు జునైద్ ఖాన్‌ల మధ్య కెమిస్ట్రీ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్ ఖాన్, మన్సూర్ ఖాన్ మరియు అపర్ణ పురోహిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రామ్ సంపత్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇర్షాద్ కామిల్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Read More..

అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. సమ్మర్ స్పెషల్‌గా రాబోతున్న ‘లెనిన్’ మూవీ

Next Story