- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాని చేతుల మీదుగా ‘అలేల్లే అలేల్లే’
మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు ‘శ్రీనివాస మంగాపురం’ అనే క్రేజీ ప్రాజెక్టుతో రాబోతున్నాడు.

దిశ, సినిమా: ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి విభిన్నమైన చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు ‘శ్రీనివాస మంగాపురం’ అనే క్రేజీ ప్రాజెక్టుతో రాబోతున్నాడు. ఈ మూవీతో ఘట్టమనేని వారసుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతే కాకుండా.. ప్రచారాలతో ఇప్పటికే ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మహేష్ బాబు రిలీజ్ చేసి మరింత హైప్ పెంచేశాడు. ఇప్పుడు ఇదే జోష్‌తో ఫస్ట్ సింగిల్‌ను తీసుకురాబోతున్నారు చిత్ర బృందం. ‘అలేల్లే అలేల్లే’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను నేచురల్ స్టార్ నాని ఏప్రిల్ 29 ఉదయం 11గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ క్యూట్ పోస్టర్‌ను షేర్ చేశారు.






