'ఆయా షేర్'తో రికార్డు కొట్టిన నాని

by Pulgam srinivas |   (  Updated:2026-02-25 07:23:52  IST  )

The Paradise : 41 నిమిషాల్లోనే 100k లైక్స్ సాధించి మీడియం రేంజ్ హీరోలలో రికార్డు కొట్టేసిన ఆయా షేర్ సాంగ్.

ఆయా షేర్తో రికార్డు కొట్టిన నాని
X

దిశ, వెబ్ డెస్క్ : నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. చాలా కాలం క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. అది అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఒక్కసారిగా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇక ఇప్పటికే నాని, శ్రీకాంత్ కాంబోలో రూపొందిన దసరా మూవీ మంచి విజయాన్ని సాధించి ఉండడం, ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమాను ఆగస్టు 21వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఆయా షేర్ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది. దానితో ఈ లిరికల్ వీడియో సాంగ్ ఎన్నో రికార్డులను సృష్టిస్తుంది. మీడియం రేంజ్ హీరోల లిరికల్ వీడియోలలో ఆయా షేర్ ఒక కొత్త రికార్డును సృష్టించింది. ఈ పాటకి విడుదల అయిన 41 నిమిషాల్లోనే 100k లైక్స్ లభించాయి. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఏ మీడియం రేంజ్ హీరో నటించిన సినిమాలోని లిరికల్ వీడియోకి కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని లైక్స్ రాలేదు. దానితో ది ప్యారడైజ్ చిత్రంలోని ఆయా షేర్ సాంగ్ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది.

సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్ కూడా!.. NTRNeel సినిమా షూటింగ్‌పై బిగ్ అప్డేట్

Next Story