సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్ కూడా!.. NTRNeel సినిమా షూటింగ్‌పై బిగ్ అప్డేట్

by Chukka Sudharani |

ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి మార్చిలో ఓ సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్ షూట్ చేయన్నట్లు సినీ క్రిటిక్స్ నుంచి సమాచారం.

సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్ కూడా!.. NTRNeel సినిమా షూటింగ్‌పై బిగ్ అప్డేట్
X

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘NTRNeel’. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో తారక్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా రఫ్ అండ్ రగ్గడ్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇది ఓ స్పెషల్ మూవీగా నిలవనుందని అభిమానుల్లో ఇప్పటికే ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొనగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతున్నది.

మార్చి ఎండింగ్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్‌పై ఓ సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్ షూట్ చేయన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిపేందుకు నీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. అందుకే స్క్రిప్ట్‌కే ఎక్కువ సమయం కేటాయించినట్లు తెలుస్తుంది. దీంతో ప్రతి సీన్ ఆచి తూచి చేస్తుండగా.. రామోజీ ఫిలిమ్ సిటీలో జరగబోయే యాక్షన్ సీన్ కూడా ఓ రేంజ్‌లో ఉండనుందని టాక్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అప్డేట్స్ ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.


Next Story