నాగవంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైనల్.. హీరో గ్రీన్ సిగ్నల్

by Pulgam srinivas |   (  Updated:2026-05-03 09:59:25  IST  )

నాగవంశీ బ్యానర్‌లో రామ్ చరణ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నాగవంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైనల్.. హీరో గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో యంగ్ ప్రొడ్యూసర్లలో అద్భుతమైన జోష్‌తో దూసుకుపోతున్న వారిలో సూర్యదేవర నాగవంశీ ఒకరు. చిన్న నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు విభిన్న ప్రాజెక్ట్‌లను నిర్మిస్తూ వరుస విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పలువురు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన నాగవంశీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో మాత్రం ఇప్పటివరకు ప్రాజెక్ట్‌ను సెట్ చేయలేకపోయారు. ఈ విషయంపై కొంతకాలం క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగవంశీకి ప్రశ్న ఎదురైంది. దానికి స్పందించిన ఆయన, చాలా కాలంగా రామ్ చరణ్‌తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నానని, ఆయన సన్నిహితులందరికీ కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నానని తెలిపారు.

అయినప్పటికీ ఇప్పటివరకు ఆ కాంబినేషన్ సెట్ కాలేదని, కానీ తప్పకుండా భవిష్యత్తులో చరణ్‌తో సినిమా చేస్తానని నమ్మకంగా చెప్పారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్, నాగవంశీతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రాన్ని పూర్తి చేసిన చరణ్, త్వరలోనే దర్శకుడు సుకుమార్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాడు. ఈ సినిమా అనంతరం నాగవంశీ బ్యానర్‌లో ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి దర్శకుడు, కథ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నాగవంశీ సరైన దర్శకుడు మరియు బలమైన కథను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

‘పెద్ది’ రాకతో మెగాస్టార్‌కు లైన్ క్లియర్.. ‘విశ్వంభర’ విడుదలకు డేట్ లాక్

Next Story