- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వృషకర్మ' ఈవెంట్లో కిందపడిన నాగ చైతన్య.. త్రుటిలో తప్పిన ప్రమాదం
వృషకర్మ మూవీ ఈవెంట్లో కుర్చీ వెనక్కి వంగడంతో కింద పడిపోయిన నాగచైతన్య.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు నాగచైతన్య ప్రస్తుతం 'వృషకర్మ' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుండగా, కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈరోజు ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో రిలీజ్ సందర్భంగా ఈ మూవీ బృందం వారు ఓ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. దానికి నాగచైతన్య కూడా హాజరయ్యాడు. ఈ చిత్ర బృందం వారు చాలా సమయం పాత్రికేయులతో ముచ్చటించారు.
పాత్రికేయులతో ముచ్చటించేందుకు స్టేజిపై ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోవడానికి నాగ చైతన్య వెళ్ళాడు. ఆయన కూర్చున్నాక ఆ కుర్చీ వెనక్కి పడిపోయింది. దానితో నాగచైతన్య కింద పడిపోయాడు. అలా సడన్ గా చైతన్య కింద పడిపోవడంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. కానీ చైతన్య వెంటనే తేరుకొని పైకి లేచాడు. దానితో ఆయనకు పెద్దగా గాయాలు ఏమీ కాలేదు. చైతన్య ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడంతో చాలామంది ఈ నటుడికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది అని అంటున్నారు.






