- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Naga Chaitanya: తండేల్ తర్వాత వృషకర్మ అందుకే చేశాను
నాగచైతన్య తాజాగా మాట్లాడుతూ... కార్తీక్ దండు స్టోరీ చెప్పిన విధానం నచ్చి వృషకర్మ మూవీకి ఓకే చెప్పానని ఈ నటుడు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వృషకర్మ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను ఈరోజు విడుదల చేశారు. ఈ వీడియో విడుదల సందర్భంగా ఈ మూవీ బృందం వారు ఓ చిన్నపాటి ఈవెంట్ను నిర్వహించారు. దానికి నాగచైతన్య, కార్తీక్ దండు మరి కొంతమంది ఈ మూవీ బృందం వారు హాజరయ్యారు. ఈ మూవీ యూనిట్ తాజాగా పాత్రికేయులతో ముచ్చటించింది.
అందులో భాగంగా 'నాగచైతన్య'కి మీరు సినిమా కథలను అంత ఈజీగా ఓకే చేయరు అని బయట టాక్ ఉంది. తండల్ తర్వాత కూడా మీరు అనేక స్టోరీలను విన్నట్లు తెలిసింది. మరి వృషకర్మ ఓకే చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అనే ప్రశ్న ఎదురయింది. దానికి నాగ చైతన్య ... నేను ఒక సినిమా ఓకే చేయడానికి అనేక డౌట్లు అడుగుతాను. అందుకు కారణం నేను సినిమా కథ విషయంలో పక్కాగా ఉంటే దానిపై ఫుల్ ఫోకస్ పెట్టగలను, అందుకే సందేహాలను ముందే తీర్చేసుకుంటాను.
ఈ స్టోరీని ఓకే చేయడానికి ప్రధాన కారణం కార్తీక్ దండు సినిమా కథ చెప్పిన విధానం. నాకు ఎప్పటినుండో లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ చేయాలి అని కోరిక, అలాంటి కథను కార్తీక్ నాకు వినిపించాడు. ఈ సినిమాలో నేను ట్రెజర్ హంట్ పర్సన్ గా కనిపిస్తాను, ఆ పాత్ర నాకు చాలా నచ్చింది, అందుకే ఈ సినిమాను ఓకే చేశాను. ఇంకా కొన్ని విషయాలు చెప్పవచ్చు కానీ చెబితే స్టోరీ లీక్ అవుతుంది, కాబట్టి చెప్పడం లేదు అని నాగ చైతన్య సమాధానం ఇచ్చాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది.






