- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవి సినిమాకు మెగా ఫ్యామిలీ..నాగబాబు షాకింగ్ లుక్ !
మన శంకర వరప్రసాద్ సినిమా చూసేందుకు వచ్చిన నాగబాబు లుక్ అందరికీ షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో జనాలు ఎగబడి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నమే మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఈ సినిమాను తిలకించారు. తాజాగా మెగా కుటుంబం మొత్తం AMB మాల్ లో సినిమా చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.
షాకింగ్ లుక్ లో నాగబాబు !
మన శంకర వరప్రసాద్ సినిమా చూసేందుకు వచ్చిన నాగబాబు లుక్ అందరికీ షాక్ ఇచ్చింది. ఆయన గతంలో కంటే ఇప్పుడు యాక్టివ్ గా కనిపించడం లేదు. నడవడానికి కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆయన స్లిమ్ గా కూడా మారిపోయారు. ఏజ్ పై పడడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నాగబాబు షాకింగ్ లుక్స్ వైరల్ గా మారాయి.
ఇది ఇలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. విక్టరీ వెంకటేష్ 20 నిమిషాల పాటు ఈ సినిమాలో కనిపించబోతున్నారట. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీత స్వరాలు అందించారు.






