- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ తేదీన రీ రిలీజ్ కానున్న మున్నా
ప్రభాస్ హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మున్నా' సినిమాను మార్చి 6వ తేదీన రీరిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ 2007లో మున్నా అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా 'మున్నా'ను కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
ఈ చిత్రాన్ని మార్చి 6వ తేదీన మళ్లీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమా రీ రిలీజ్లో భాగంగా ఎలాంటి ప్రభావాన్ని బాక్సాఫీస్ దగ్గర చూపిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా గోవా బ్యూటీ ఇలియానా నటించగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు.
ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించకపోయినా ఇందులోని ప్రభాస్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇలియానా తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడిగా వంశీ పైడిపల్లికి ఇది మొదటి సినిమా. కమర్షియల్గా ఈ సినిమా ఆయనకు ఆనందాన్ని ఇవ్వకపోయినా దర్శకుడిగా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.






