- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతడు రీ రిలీజ్.. టోటల్ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఇదే
అతడు రీ రిలీజ్ : తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక థియేట్రికల్ హక్కులను దక్కించుకుంది వీరే.

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన అతడు మూవీని ఫిబ్రవరి 28వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మహేష్ నటించిన అనేక సినిమాలు రీ రిలీజ్లో మంచి కలెక్షన్లను రాబడుతున్న నేపథ్యంలో అతడు సినిమా థియేట్రికల్ హక్కుల కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల, కర్ణాటక థియేటర్ హక్కులు అమ్ముడుపోయాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను ఏ ప్రాంతంలో ఎవరు దక్కించుకున్నారు అనేది అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ: లక్ష్మీ నరసింహ మూవీస్, ఏషియన్ సినిమాస్
ఉత్తరాంధ్ర: కాకినాడ టాకీస్, శ్రీ అన్నపూర్ణ ఫిలిమ్స్
ఈస్ట్ గోదావరి జిల్లా: శ్రీ శ్రీనివాస మూవీస్
వెస్ట్ గోదావరి జిల్లా: వీజేఎన్ ప్రొడక్షన్స్
కృష్ణ జిల్లా: ఉషా పిక్చర్స్
గుంటూరు జిల్లా: వి ఎంటర్టైన్మెంట్
నెల్లూరు: ఆర్కే ఫిలిమ్స్
సీడెడ్: ధనుష్ ఫిలిమ్స్
కర్ణాటక: కుమార్ ఫిలిమ్స్
ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. సోనుసూద్, ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, సునీల్, అజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.






