మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోల్స్‌.. గట్టిగా ఇచ్చి పడేసిన లావణ్య త్రిపాఠి(ట్వీట్)

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-04 06:34:26  IST  )

సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మెగాస్టార్ చిరంజీవిపై  సోషల్ మీడియాలో ట్రోల్స్‌..  గట్టిగా ఇచ్చి పడేసిన లావణ్య త్రిపాఠి(ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘అందాల రాక్షసి’(Andala Rakshasi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ చిత్రం తోనే మంచి ఫేమ్‌తో పాటు విజయం సాధించింది. అంతేకాకుండా ఈ సినిమాలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్‌(Varun Tej)తో పీకల్లోతు ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు సీక్రెట్‌గా లవ్ చేసుకున్న ఈ జంట ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు.

అయితే వీరికి రీసెంట్‌గా ఓ బాబు కూడా పుట్టారు. ఇక అతనికి వాయువ్ తేజ్‌(Vayuv Tej) అనే పేరు కూడా పెట్టారు. అయితే ఇప్పటి వరకు రామ్ చరణ్(Ram Charan) కపుల్ లాగానే ఈ జంట కూడా తమ బేబీ ఫొటోను మాత్రం చూపించలేదు. ఇక లావణ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రజెంట్ ‘సతీ లీలావతి’(Sathi Leelavathi) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్(Dev Mohan) హీరోగా నటిస్తుండగా.. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1 చిత్రంగా తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహిస్తుండగా.. నాగ మోహన్ బాబు ఎమ్, రాజేష్.టి(Rajesh.T) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా సమ్మర్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో కొంతమంది అసభ్యంగా, అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి తన పిల్లలు, మనవరాళ్ల విషయంలో ఆడ–మగ తేడా చూపిస్తున్నారంటూ కొన్ని పోస్టులు వైరల్ కావడంతో, ఆ వ్యాఖ్యలను లావణ్య తీవ్రంగా ఖండించారు. ఇక ఆ ట్రోలర్స్‌కు మెగా కోడలు లావణ్య త్రిపాఠి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సంచలన ట్వీట్ చేశారు. ‘సాధారణంగా నేను ఇలాంటి ట్వీట్లను పట్టించుకోకుండా వదిలేస్తాను. కానీ ఈసారి మాత్రం స్పందించక తప్పలేదు. ఒక సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం చాలా నీచమైన ఆలోచన.

చిరంజీవి కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా తన మనవరాళ్లను ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో విమర్శలు చేసే వారికి అసలు అవగాహనే లేదు. చిరంజీవి చేసే సేవలు, కుటుంబానికి ఇచ్చే విలువ చాలా మందికి సాధ్యం కానివి. కనీసం ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వారు, ఆయన వ్యక్తిత్వం పై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ఎవరి గురించి పూర్తిగా తెలియకుండానే సోషల్ మీడియాలో తీర్పులు ఇవ్వడం తప్పు, అలాంటి వారు ఇప్పటికైనా నోర్లు మూసుకుంటే మంచిది’ అని గట్టిగా స్పందించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ లావణ్య త్రిపాఠిను సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

మెగా కుటుంబంలో ఆ సెంటిమెంట్.. ఉపాసన-రామ్ చరణ్‌ల పిల్లల పేర్లపై నెట్టింట చర్చ..

Next Story