- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా కుటుంబంలో ఆ సెంటిమెంట్.. ఉపాసన-రామ్ చరణ్‌ల పిల్లల పేర్లపై నెట్టింట చర్చ..
టాలీవుడ్ మెగా కపుల్ రామ్ చరణ్(Ram Charan)- ఉపాసన(Upasana)ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మెగా కపుల్ రామ్ చరణ్(Ram Charan)- ఉపాసన(Upasana)ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మ్యారేజ్ అయిన 11 ఏళ్లకు ఓ పాపకు తల్లిదండ్రులు అయ్యారు. ఇక ఆ మెగా ప్రిన్సెస్‌కి క్లీంకార(Klikaara) అనే నామకరణం కూడా చేశారు. అయితే పుట్టినప్పటినుంచి ఆ పాప ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు మెగా ఫ్యామిలీ. కానీ, ఆమెతో సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలన్నింటినీ మెగా కోడలు ఉపాసన తన సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసేది. క్లీంకార మెగా కుటుంబానికి అదృష్ట దేవత అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ చిన్నారి పుట్టినప్పటినుంచి మెగా ఇంట్లో అని మంచి శుభాలే జరిగాయి.
అయితే రీసెంట్‌గా ఉపాసన మళ్లీ రెండోసారి తల్లి అయిన సంగతి తెలిసిందే. జనవరి 31న శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఓ బాబు, పాపకు(ట్విన్స్) జన్మనిచ్చింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారసుడి రాకతో చిరంజీవి(Chiranjeevi) కుటుంబం మాత్రమే కాదు, అభిమానులు కూడా ఉత్సాహంలో మునిగిపోయారు. ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తండ్రిగా మారిన రామ్ చరణ్ జీవితంలో ఇది మరో మధుర ఘట్టం అనే చెప్పాలి. ఈ సందర్భంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పిల్లల పేర్లకు సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే సాధారణంగా మెగా కుటుంబంలో పిల్లలకు ఆంజనేయ స్వామి లేదా శ్రీరాముడి(Sri Ramudu) పేర్లకు సంబంధించిన సెంటిమెంట్స్ కనిపిస్తుంటాయి. అంత ఎందుకు వరుణ్ తేజ్(Varun Tej) కొడుకు పేరు కూడా వాయువ్ తేజ్(Vayuv Tej) అని వాయుపుత్రుడైన హనుమంతుడిని సూచిస్తూ ఆ పేరు పెట్టారు.
అయితే రామ్ చరణ్ తన మొదటి కూతురికి మాత్రం భిన్నంగా ‘క్లీంకారా’ అనే పేరు పెట్టడం విశేషం. ఈ పేరు లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు అప్పట్లో చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు కవలల విషయంలో కూడా ఆధ్యాత్మిక అర్థం ఉన్న పేర్లనే ఎంచుకుంటారా? లేక సంప్రదాయ సెంటిమెంట్‌ను కొనసాగిస్తారా? అన్నదే ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మగబిడ్డకు ఎవరు పేరు పెడతారు అన్న అంశంపై అభిమానుల్లో చర్చ నడుస్తోంది. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం చరణ్ ఎక్కువగా అయ్యప్ప, ఆంజనేయ స్వామిల మాల వేసుకుంటాడు కాబట్టి దేవుళ్ల పేర్లు కలిసేలా పెడతారని అంటుంటే మరికొంత మంది మాత్రం ఉపాసన వదిన చెప్పిందే పెడతారు కావచ్చు అని అంటున్నారు.
కాగా ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’(Peddi) సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక దీనిని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించారు. అయితే ఈ సినిమాలో జగపతి బాబు(Jagapathi babu), శివ రాజ్‌కుమార్(Sivaraj Kumar), దివ్యేందు(Divvendu) కీరోల్ ప్లే చేస్తున్నారు. మార్చి 27న రిలీజ్ కానున్న ఈ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. గట్టిగా ఇచ్చి పడేసిన లావణ్య త్రిపాఠి(ట్వీట్)






