- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడే "మన శంకరవర ప్రసాద్ గారు" ప్రీ రిలీజ్..చిరంజీవి ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ?
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ ప్రీ రిలీజ్ ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటలకు హైదరాబాదులోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా విడుదలకు కేవలం ఐదు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో దూసుకు వెళ్తోంది చిత్ర బృందం.
ఇక ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ లో నిర్వహించేందుకు భారీ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి రావడం కష్టమే అని ప్రచారం జోరు అందుకుంది. ఆయనకు చిన్నపాటి సర్జరీ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈవెంట్ కు దూరం అవుతాడని ప్రచారం చేస్తున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవితో పాటు నయనతార, విక్టరీ వెంకటేష్ కూడా ఈవెంట్ కు వస్తారని చిత్ర బృందం స్పష్టం చేస్తోంది. కాగా ఈ ఈవెంట్ ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటలకు హైదరాబాదులోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు.






