- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరంజీవి, ప్రభాస్ నిర్మాతలకు హైకోర్టులో ఊరట
మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు చిత్రం, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మనశంకర వరప్రసాద్ గారు చిత్రం, రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) రాజాసాబ్ చిత్రాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలు కల్పించకుండా గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తాజాగా మన శంకర వరప్రసాద్ గారు, రాజాసాబ్ చిత్ర నిర్మాతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. బుధవారం విచారణకు స్వీకరించిన కోర్టు.... సింగిల్ బెంచ్ తీర్పును గేమ్ చేంజర్, పుష్ప-2, ఓజీ, అఖండ-2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేసినట్లు స్పష్టం చేసింది. చిరంజీవి, ప్రభాస్ చిత్రాలకు ఆ ఉత్తర్వులు వర్తించవని పేర్కొంది. దీంతో నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా జనవరి 12న, ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read More..






