- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకుతో మెగా కపుల్.. ఆకట్టుకుంటున్న క్యూట్ ఫొటోస్
మెగా కపుల్ వరుణ్ తేజ్(Varun Tej)- లావణ్య త్రిపాఠి(Lavanya Tripati)ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా కపుల్ వరుణ్ తేజ్(Varun Tej)- లావణ్య త్రిపాఠి(Lavanya Tripati)ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘మిస్టర్’(Mister), ‘అంతరిక్షం’(Anthariksham) సినిమాల్లో జంటగా నటించిన వీరు ఆ టైమ్‌లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఈ విషయాన్ని బయట పడకుండా సీక్రెట్‌గా లవ్ చేసుకుని డైరెక్ట్ ఎంగేజ్‌మెంట్ ఫొటోస్‌తో ఫ్యాన్స్‌కు బిగ్ షాకిచ్చారు. అలా సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపిన ఈ జంట నవంబర్1,2023లో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఈ జంటకు 2025, సెప్టెంబర్‌లో మగబిడ్డ కూడా జన్మించాడు.
దీంతో వీరిద్దరు తల్లిదండ్రులుగా ప్రమోషన్స్ పొందారు. అయితే బాబుకు వాయువ్ తేజ్ కొణిదెల(Vayuv Tej Konidela) అని పేరు పెట్టగా.. అతని ఫేస్‌ను మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. అయితే తాజాగా ఈ జంట తమ కుమారుడితో సంక్రాంతి వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న పిక్స్‌లో సాంప్రదాయ దుస్తుల్లో వరుణ్-లావణ్య తమ చిట్టి తండ్రి వాయువ్‌ను ఎత్తుకొని దిగిన ఫొటోలు మెగా ఫ్యాన్స్ మనసులు గెలుచుకుంటున్నాయి. అలాగే తమ ఫ్యామిలీతో దిగిన ఫొటోలు కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు క్యూట్ మెగా ప్రిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..






