- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్ హీరో వ్యాఖ్యల పై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?
ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై బాలీవుడ్(Bollywood) యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్(Vidyut Jammwal) ప్రశంసల వర్షం కురిపించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై బాలీవుడ్(Bollywood) యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్(Vidyut Jammwal) ప్రశంసల వర్షం కురిపించారు. మార్షల్ ఆర్ట్స్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నైపుణ్యాన్ని కొనియాడుతూ.. ‘గ్రాండ్‌మాస్టర్’ అని సంబోధించారు. తాజాగా దీనిపై పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
విద్యుత్ జమ్వాల్ ప్రశంసలకు పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలుపుతూ.. ‘‘మార్షల్ ఆర్ట్స్‌కు కట్టుబడి ఉన్న మీలాంటి వారి నుంచి ఈ మాటలు రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మన సంప్రదాయ యుద్ధ కళ కళరిపయట్టును ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకం. క్రమశిక్షణ, వారసత్వం, యోధ స్ఫూర్తిని గౌరవించడానికి సినిమాను ఇంత నిజాయతీగా ఉపయోగించడం అభినందనీయం. మీ తదుపరి ప్రాజెక్టులకు శుభాకాంక్షలు’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యుత్ జమ్వాల్ కూడా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యుడు.






