Meenakshi: ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే నాకు ఫుల్ క్రష్.. షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ బ్యూటీ

by Pulgam srinivas |   (  Updated:2026-04-27 03:29:27  IST  )

మీనాక్షి చౌదరి ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “నాకు ప్రభాస్ గారంటే చాలా ఇష్టం. ఆయనపై నాకు పెద్ద క్రష్ ఉంది” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Meenakshi: ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే నాకు ఫుల్ క్రష్.. షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఇచట వాహనములు నిలపరాదు’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, ‘హిట్: ది సెకండ్ కేస్’ మూవీతో మొదటి విజయాన్ని తెలుగు బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన నటిగా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. తాజాగా మీనాక్షి చౌదరి ఓ టాలీవుడ్ స్టార్ హీరో గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

“నాకు ప్రభాస్ గారంటే చాలా ఇష్టం. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఆయన నటన, వ్యక్తిత్వం రెండింటినీ నేను చాలా ఇష్టపడతాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయనపై నాకు పెద్ద క్రష్ ఉంది” అంటూ ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సంక్రాంతికి విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మకు మంచి విజయం దక్కింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

వంగిన భంగిమలో అందాలు హైలైట్ చేసిన వామికా గబ్బి

Next Story