చంద్రబాబు నాయుడి రొమాంటిక్ లవ్ స్టోరీ.. ప్రత్యక్ష సాక్షి వైఎస్‌ఆర్.. ఆ యువతి ఎవరంటే..?

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-13 13:18:16  IST  )

- కల్పిత కథను జోడిస్తూ వైఎస్ఆర్, చంద్రబాబు రాజకీయ ప్రస్థానం - స్నేహితుల నుంచి ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు లెజెండ్స్ - ఎందుకు విడిపోయారు? ఎలా వ్యతిరేకులుగా మారారు?

చంద్రబాబు నాయుడి రొమాంటిక్ లవ్ స్టోరీ.. ప్రత్యక్ష సాక్షి వైఎస్‌ఆర్.. ఆ యువతి ఎవరంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్’ లాంటి చిత్రాల తర్వాత డైరెక్టర్ దేవకట్టా నుంచి ఓ ప్రాజెక్ట్ వస్తుందంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా పొలిటికల్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే సినీ లవర్స్‌ దేవకట్టా సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటి అంచనాలన్నింటిని రీచ్ అవుతూ ‘మయసభ’తో హిట్ కొట్టాడు దర్శకుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు జీవితాలను ఆదర్శంగా తీసుకుని.. కాస్త కల్పిత కథను జోడిస్తూ ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ ఆహా అనిపించేలా చేశాడు. ముఖ్యంగా వైఎస్ఆర్, చంద్రబాబు ఫ్రెండ్‌షిప్, లవ్ ట్రాక్, రాజకీయ ప్రస్థానం వావ్ అనిపించేలా తెరమీదకు తీసుకొచ్చాడు.

ఫ్రెండ్స్.. స్ట్రాంగ్ బాండ్

కాకర్ల కృష్ణమ నాయుడు (KKN)గా ఆది పినిశెట్టి.. ఎంఎస్ రామిరెడ్డి (MSR)గా చైతన్య రావు నటించగా.. వీరి ఫ్రెండ్ షిప్ 1970-80కాలంలో ఏపీ పాలిటిక్స్‌లో కీలకంగా మారింది. చిత్తూరుకు చెందిన నాయుడు రాజకీయాల్లో చురుగ్గా ఉండగా.. కడప ఫ్యాక్షన్ నేపథ్యం, వైద్య విద్య చదివిన విద్యార్థి రామిరెడ్డి.. ఓ రాజకీయ సంఘటనతో క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారుతారు. రాజకీయాల్లో రాణించాలన్న కోరిక, న్యాయం కోసం పోరాడాలనే తపన.. ఇద్దరిలో కామన్ కావడంతో స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. బలాలు, బలహీనతలు తెలుసుకుంటూ.. ఒకరికి సపోర్ట్‌గా మరొకరు ముందుకు సాగుతారు.

ఎనిమీస్.. ఫేస్ టు ఫేస్..

పొలిటికల్ టార్గెట్స్ రీచ్ అయ్యేందుకు.. పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతారు. నాయుడి వాక్చాతుర్యం, రామిరెడ్డి ఫాక్షన్ నేపథ్యం కలవడంతో ఎవరూ ఎదిరించలేని స్నేహితులుగా మారుతారు. కానీ కొందరి రాజకీయ కుట్రలు, ఎమర్జెన్సీ పీరియడ్.. వీరి ఫ్రెండ్‌షిప్‌ను పరీక్షిస్తుంది. ఆది పినిశెట్టి, చైతన్య రావు నటన ద్వారా.. ఈ పాత్రల మధ్య భావోద్వేగాన్ని తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యారు దేవకట్టా. అయితే రాయపాటి చంద్రశేఖర్ రావు కొత్తపార్టీ పెట్టడం, నాయుడు అందులో జాయిన్ కావడం, రామిరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగడం.. కొందరి కుట్రలు.. వారి మధ్య విభేదాలను తెచ్చిపెడుతాయి. స్నేహితులు కాస్త ప్రత్యర్థులుగా మారేందుకు దారితీస్తుంది.

లవ్ ట్రాక్

అయితే మయసభలో వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు లవ్ ట్రాక్ కూడా యాడ్ చేశారు డైరెక్టర్ దేవకట్టా. అయితే ఇది సిరీస్‌ను కాస్త స్లోగా, బోరింగ్‌గా మార్చేసింది. నాయుడు, రామిరెడ్డి క్యారెక్టర్స్ లవ్ ట్రాక్‌లో రొమాంటిక్ సన్నివేశాలు జోడించడం కొందరు అభిమానులకు మింగుడుపడలేదు. సోషల్ మీడియాలో కాస్త విమర్శలు వచ్చాయి. నాయుడు కాలేజీలో ఓ అమ్మాయితో రొమాంటిక్ లవ్ స్టోరీ నడిపించగా.. రామిరెడ్డి కూడా మరో అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఇంతకీ వీరెవరు? ఎవరు ఎవరికి ఎలా సపోర్ట్ చేశారు? దేనికి ప్రత్యక్షసాక్షులుగా ఉన్నారు? అనేది ఫస్ట్ ఎపిసోడ్స్‌లో కొనసాగుతుంది. కానీ ఇవన్నీ సిరీస్‌కు ప్లస్ కాలేదు కానీ పొలిటికల్ డ్రామా ప్రత్యర్థులుగా మారే టైమ్‌లో ఎండ్ అయిపోయింది. సెకండ్ సీజన్‌కు స్టార్టింగ్ పాయింట్‌గా మారింది.

Read More..

మయసభపై మరో వివాదం.. బీసీ నేతను అవమానించారని ఆగ్రహం

Next Story