మయసభపై మరో వివాదం.. బీసీ నేతను అవమానించారని ఆగ్రహం

by Muthe.Rajitha |   (  Updated:2025-08-13 13:17:18  IST  )

డైరెక్టర్ 'దేవాకట్ట'(Devakatta) దర్శకత్వంలో వచ్చిన 'మయసభ'(Mayasabha) వెబ్ సిరీస్ పై మరో వివాదం రేగింది.

మయసభపై మరో వివాదం.. బీసీ నేతను అవమానించారని ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : డైరెక్టర్ 'దేవాకట్ట'(Devakatta) దర్శకత్వంలో వచ్చిన 'మయసభ'(Mayasabha) వెబ్ సిరీస్ పై మరో వివాదం రేగింది. సిరీస్ లో పేర్లు మార్చినప్పటికీ ఆ పాత్రలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడును పోలి ఉన్నాయని చూసిన వారంతా అనుకుంటున్నారు. వారు ఇద్దరూ యువనేతలుగా ఎదిగి, ముఖ్య నేతలయ్యి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయినా సంగతి తెలిసిందే. అయితే వారి ఇద్దరి రాజకీయ జీవితాలను పరిచయం చేస్తూ, రాజకీయాల్లో ఎదిగే క్రమాన్ని ఇందులో చూపించారు. కాగా వీరితోపాటు అప్పటి మిగతా నేతలైన ఇందిరా గాంధీ వంటి ప్రముఖ నేతలను కూడా ఇందులో చూపించారు.

అయితే ఇందులో ఉన్న మరి కొంతమంది రాజకీయ నాయకుల పాత్రలపై కొత్త వివాదం రేగుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం వెనుకబడిన, బలహీన వర్గాలకు చెందిన ఓ ముఖ్య నేత అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కాళ్ళు పట్టుకున్నట్టు చూపించే సీన్ పై బీసీ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో చూపించిన ఆ నేత నిజజీవితంలో.. 1969 తెలంగాణ ఉద్యమనాయకుడు, నాలుగుసార్లు బాల్కొండ, ఆర్మూర్ నియిజకవర్గం నుంచి, మరోసారి ఏకగ్రీవంగానే ఎమ్మెల్యేగా ఎన్నికైన గడ్డం రాజారాంను పోలి ఉంది. తొలి దశ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆ నేతను సిరీస్ లో సీఎం పదవికోసం ఇందిర కాళ్లపై పడ్డట్టు చూపించడం, ఆయనను ఘోరంగా అవమానించడమేనని బీసీ నేతలు మండిపడుతున్నారు.

ఆయన ఎప్పుడూ ఏ పదవి కోసం ఆశ పడలేదని, ఎవ్వరి దగ్గర పదవికోసం టికెట్ కోసం చేయి కూడా చూపని రాజారామ్.. కాళ్లపై పడ్డట్టు ఎలా చూపిస్తారని నిలదీస్తున్నారు. అగ్రవర్ణ నేతలు రాజకీయంగా ఎదగడానికి చేసిన హత్యలు, కుట్రలు, ఫ్యాక్షన్ ను హీరోయిజంగా చూపించిన దేవాకట్ట బడుగు వర్గాల నేతలను మాత్రం మద్యం సేవిస్తూ, క్యాబరే డ్యాన్సర్ల చుట్టూ తిరుగుతున్నట్టు, ఇతరులతో అసహ్యంగా ప్రవర్తిస్తున్నట్టు చూపించారని ఫైర్ అవుతున్నారు. ఇది సమర్థనీయం కాదని, తక్షణమే బీసీ వర్గాలకు క్షమాపణ చెబుతూ, దేవకట్టా ఆయా సీన్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More..

చంద్రబాబు నాయుడి రొమాంటిక్ లవ్ స్టోరీ.. ప్రత్యక్ష సాక్షి వైఎస్‌ఆర్.. ఆ యువతి ఎవరంటే..?

Next Story