మంగ్లీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి.. ‘మా’ అసోసియేషన్‌‌‌కు అందిన ఫిర్యాదు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-18 11:59:06  IST  )

మైక్రో ఫైనాన్స్ మోసం ఆరోపణల నేపథ్యంలో సింగర్ మంగ్లీని తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ఫిర్యాదు అందింది.

మంగ్లీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి.. ‘మా’ అసోసియేషన్‌‌‌కు అందిన ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) అలియాస్ సత్యవతి చుట్టూ వివాదం ముదురుతోంది. మైక్రో ఫైనాన్స్ ఆరోపణల నేపథ్యంలో ఆమెను తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ మేరకు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (TMAA) జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ (Sampath Nayak) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో నిరుపేదలను మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంపత్ నాయక్.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. నిరుపేద బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు ఆమెను సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, గత కొంతకాలంగా మైక్రో ఫైనాన్స్ (Micro Finance) పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు, అనుచరులు సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మంగ్లీపై కేసు నమోదైంది. నిరుపేదల సొమ్మును కాజేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మంగ్లీపై సంపత్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుపై ‘మా’, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మంగళవారం 2'లోకి మరో నిర్మాత ఎంట్రీ?

మంగ్లీ వివాదంలో పోలీసులది అత్యుత్సాహమేనా? హైకోర్టు సీరియస్ తో ఈ కేసులో ఏం జరగబోతోంది?

Next Story