'మంగళవారం 2'లోకి మరో నిర్మాత ఎంట్రీ?

by Pulgam srinivas |

అజయ్ భూపతి తాజాగా ‘మంగళవారం 2’ చిత్రానికి సంబంధించిన కథను కొరటాల శివతో పాటు మిక్కిలినేని సుధాకర్‌కు కూడా వినిపించినట్లు తెలుస్తోంది.

మంగళవారం 2లోకి మరో నిర్మాత ఎంట్రీ?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అయిన అజయ్ భూపతి, కార్తికేయ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా రూపొందిన ‘ఆర్‌ఎక్స్ 100’ అనే లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఆయనకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ దర్శకుడు శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘మహా సముద్రం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో ‘మంగళవారం’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందించాడు. 2023లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో అజయ్ భూపతి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా రూపొందుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ‘మంగళవారం 2’ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ‘మంగళవారం’ సీక్వెల్‌ను దర్శకుడు కొరటాల శివ నిర్మించనున్నట్లు గత కొంతకాలంగా ఓ వార్త వైరల్ అవుతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. అజయ్ భూపతి, ‘మంగళవారం 2’ చిత్రానికి సంబంధించిన కథను కొరటాల శివతో పాటు నిర్మాత మిక్కిలినేని సుధాకర్‌కు కూడా వినిపించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు, అన్ని అనుకూలంగా సాగితే మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story