బాలయ్య కోసం రంగంలోకి దిగిన మంచు మనోజ్.. బర్త్ డే విషెస్ తెలుపుతూ అదిరిపోయే సర్‌ప్రైజ్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-20 06:23:27  IST  )

వైవిధ్యమైన నటుడిగా పేరు తెచ్చుకున్న మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్‌లోకి స్వాగతం పలికారు దర్శకుడు గోపీచంద్ మలినేని.

బాలయ్య కోసం రంగంలోకి దిగిన మంచు మనోజ్.. బర్త్ డే విషెస్ తెలుపుతూ అదిరిపోయే సర్‌ప్రైజ్!
X

దిశ, సినిమా: దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘NBK-111’. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ కొత్త సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్‌ను షేర్ చేశారు గోపీచంద్ మలినేని.. వైవిధ్యమైన నటుడిగా పేరు తెచ్చుకున్న మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్‌లోకి స్వాగతం పలికారు దర్శకుడు. ఈ విషయంపై మంచు మనోజ్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ‘‘నా పుట్టినరోజులు దేవుడిచ్చిన వరాల్లా వస్తాయి. నా జీవితంలో నేను ఎంతో ఆశగా కోరుకున్న అత్యంత ప్రత్యేకమైన బహుమతిని ఈ పుట్టినరోజు నాకు తెచ్చి ఇచ్చింది…చివరికి… నా కల నిజమవుతోంది. మన లయన్ ఎన్.బి.కె. బాలయ్య అన్నతో కలిసి నటించాలనే నా ఎన్నో ఏళ్ల నిరీక్షణ, దర్శకుడు గోపీచంద్ మలినేని గారి సినిమాతో నెరవేరుతోంది. ఈ క్షణం నా పుట్టినరోజును మరింత గుర్తుండిపోయేలా చేయడమే కాకుండా, నా మనసుకు ఎంతో దగ్గరగా నిలిపింది.

భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా.. నా బాలయ్య అన్నపై, గోపీచంద్ గారిపై నాకు ఉన్న గౌరవం, వారితో నాకున్న అనుబంధం వల్ల ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేకంగా ఉంటుంది. నాపై చూపిస్తున్న ప్రేమకు, అందుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రాబోయే సినిమాలతో మీ ముందుకు రాబోతున్నాను. నా అభిమానులందరికీ ఒకటే మాట ఇస్తున్నాను.. ఈసారి థియేటర్లలో మీకు ఒక పెద్ద పండగ లాంటి విందు ఉండబోతోంది. మీరు చూసే ప్రతి క్షణం.. ఈ నిరీక్షణకు తగినట్టుగా ఉంటుంది. నాలో ఉత్సాహం మామూలుగా లేదు!ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మీ అందరి ముందుకు తీసుకురావడానికి నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. అయితే, సినిమాలో మనోజ్ ఏ పాత్ర పోషిస్తున్నారనే విషయాన్ని మాత్రం చిత్ర బృందం సస్పెన్స్‌గా ఉంచింది.ఈ సినిమాలో మంచు మనోజ్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది.గతంలో ఆయన ‘మిరాయ్’, ‘భైరవం’ వంటి చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి వరుస హిట్లు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బాలకృష్ణ లాంటి మాస్ హీరో సినిమాలో విలన్‌గా నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. గతంలో మంచు మనోజ్ నటించిన ‘ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా’ చిత్రంలో బాలయ్య ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బాలయ్య కోసం మంచు మనోజ్ రంగంలోకి దిగడం విశేషం.

గాడ్ ఆఫ్ వార్‌పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నాగ వంశీ

Next Story