గాడ్ ఆఫ్ వార్‌పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నాగ వంశీ

by Pulgam srinivas |   (  Updated:2026-05-20 06:24:15  IST  )

తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాగ వంశీ, “త్వరలోనే మా ‘గాడ్ ఆఫ్ వార్’ సెట్స్‌లో తారక్‌ను కలుస్తాం” అంటూ ఒక పోస్ట్ చేశారు.

గాడ్ ఆఫ్ వార్‌పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నాగ వంశీ
X

దిశ, వెబ్ డెస్క్: ఈరోజు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘డ్రాగన్’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్, పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్‌తో వచ్చిన ఈ గ్లింప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే చిత్రం రూపొందనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మించనున్నట్లు, అలాగే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తారక్ పుట్టినరోజు సందర్భంగా వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ను నాగ వంశీ వెల్లడించారు. తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, “త్వరలోనే ‘గాడ్ ఆఫ్ వార్’ షూటింగ్ సెట్స్‌లో కలుద్దాం” అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ‘డ్రాగన్’ సినిమా విషయానికి వస్తే ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

బాలయ్య కోసం రంగంలోకి దిగిన మంచు మనోజ్.. బర్త్ డే విషెస్ తెలుపుతూ అదిరిపోయే సర్‌ప్రైజ్!

Next Story