మన శంకర వర ప్రసాద్ గారు సినిమాపై కీలక అప్డేట్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-08 14:51:47  IST  )

రేపటి నుండి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలోని ఓ బ్యూటిఫుల్ సాంగ్ చిత్రీకరణ జరగబోతుంది. చిరు, నయన్‌తో ఈ పాటను చిత్రీకరించనున్నారు.

మన శంకర వర ప్రసాద్ గారు సినిమాపై కీలక అప్డేట్
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మెగాస్టార్ కూతురు సుస్మిత కొనిదెల సైతం సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని చిరంజీవి, నయనతార మధ్య కీలక సన్నివేశాలను చిత్రిస్తున్నారు. కాగా రేపటి నుండి చిరు, నయన్‌తో ఓ బ్యూటిఫుల్ సాంగ్ చిత్రీకరణ జరగబోతుంది.

ఈ పాటను హైదరాబాద్‌లోనే షూట్ చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. రేపు చిత్రీక‌రించ‌బోయే పాట‌కు విజ‌య్ పోలంకి కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్, గ్లింప్స్ మ‌రియు వినాయ‌క‌చ‌వితి పోస్ట‌ర్ చిరు అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. మ‌రి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.

Read Also..

కిల్లింగ్ లుక్స్‌తో కిల్లర్ గర్ల్.. హీరోయిన్ స్పెషల్ పోస్టర్‌తో హైప్ పెంచేసిన మేకర్స్

Next Story