- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిల్లింగ్ లుక్స్‌తో కిల్లర్ గర్ల్.. హీరోయిన్ స్పెషల్ పోస్టర్‌తో హైప్ పెంచేసిన మేకర్స్
యంగ్ హీరోయిన్ ప్రీతి అస్రాని(Preethi Asrani) సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ప్రీతి అస్రాని(Preethi Asrani) సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక నటనపై ఆసక్తితో ‘మళ్ళీరావా’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ప్రీతి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ పామ్‌లో ఉంది. త్వరలోనే ప్రీతి ‘కిస్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఈ సినిమాతో పాటు ‘కిల్లర్’(Killer) లోనూ నటిస్తోంది. ఇందులో మల్టీ టాలెంటెడ్ నటుడు నటిస్తూ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాను శ్రీ గోకులం మూవీస్, ఏంజెల్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి, ఎస్ జే సూర్య (S.J. Surya)జంటగా నటించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. నేడు ప్రీతి అస్రాని పుట్టిన రోజు కావడంతో ఆమెకు విషెస్ తెలుపుతూ చిత్రబృందం ఓ మెస్మరైజింగ్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో రెడ్ కలర్ చీర కట్టుకున్న ప్రీతి గాగుల్స్ పెట్టుకుని చేతిలో పెన్ పట్టుకుని పెదాలపై పెడుతూ స్టైలీష్ లుక్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.






