- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ బస్టర్ కొట్టిన చిరు.. హుక్ స్టెప్ వెనుక ఉన్న స్టోరీ ఇదే
మెగాస్టార్ చిరంజీవి "మన శంకర వరప్రసాద్ గారు" సినిమాతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి "మన శంకర వరప్రసాద్ గారు" సినిమాతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ +ఫస్ట్ డే కలెక్షన్లు రూ.84 కోట్లు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారికంగా వెల్లడించింది. కాగా.. ఈ మూవీలో హుక్ స్టెప్ సాంగ్ బాగా వైరల్ అవుతోంది. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన ఆట సందీప్.. దానివెనుక ఉన్న స్టోరీని వెల్లడించారు. తాజాగా థియేటర్లో సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మనందరికీ ఏదొక సమస్య ఉంటుందని, వాటిలో ఈఎంఐ ఒకటి అన్నారు. హుక్ స్టెప్ సాంగ్ కు కొరియోగ్రఫీ ఏం చేయాలని ఆలోచిస్తుండగా.. తనకు వరుసగా ఈఎంఐల గురించి కాల్స్ వచ్చాయని, వాళ్ల టార్చర్ కు ఫోన్ పగలగొట్టేయాలనిపించిందన్నారు.
కంపోజింగ్ సమయంలో తాను ఫోన్ వాడనన్న సందీప్.. ఆ సమయంలో ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వస్తుందని చెప్పడంతో తీసుకెళ్లక తప్పలేదన్నారు. ఈఎంఐ కాల్స్ తో వచ్చిన చిరాక నుంచే హుక్ స్టెప్ ఐడియా వచ్చిందన్నారు. వెంటనే లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి.. ఓన్లీ మొబైల్ ఫోన్ లైట్ వేసుకుని హుక్ స్టెప్ కంపోజ్ చేశామన్నారు. ఆ స్టెప్ తన భార్యకు చాలా నచ్చడంతో దానిని మరింత డెవలప్ చేసినట్లు వివరించారు. చిరంజీవి గ్రేస్ కు తగ్గట్లే స్టెప్ ను క్రియేట్ చేసినట్లు ఆట సందీప్ తెలిపారు.
Read More..






