- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పబ్లిక్ టాక్... రవితేజ బయటపడ్డట్టేనా?
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే విదేశాలలో ఇప్పటికే ప్రీమియర్లు పడిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో వస్తున్నాడు. ఆ సినిమానే భర్త మహాశయులకు విజ్ఞప్తి ( Bhartha Mahasayulaki Wignyapthi). కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేస్తుండగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా మెరువనున్నారు. కెతిక శర్మ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారట. సునీల్, శ్రీ సత్య, వెన్నెల కిషోర్ లాంటి కీలక నటులు కూడా ఉన్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
పబ్లిక్ టాక్.. రవితేజ హిట్ కొట్టినట్లేనా?
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే విదేశాలలో ఇప్పటికే ప్రీమియర్లు పడిపోయాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పబ్లిక్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంక్రాంతికి మాస్ మహారాజు రవితేజ హిట్ కొట్టాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో పాటలు అందరినీ ఆకట్టుకోవడం గ్యారెంటీ అంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉందట. కానీ ఫస్టాఫ్ మాత్రం సినిమాకు బాగా కలిసి వస్తుందని టాక్ నడుస్తోంది. మొదటి భాగంలో కామెడీ ఇరగదీసినట్లు చెబుతున్నారు. కొన్ని సీన్స్ బాగా సాగదీసాడట. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా సత్య కామెడీ సినిమాకు హైలెట్ కానుందట. ఓవరాల్ గా రవితేజ కంబ్యాక్ అని చెప్పవచ్చని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Read More..






