BMW: ర‌వితేజ సినిమాలో క‌మెడీయ‌న్ స‌త్య‌తో మాస్ సాంగ్‌..ఇక జాత‌రే

by velandi.Saikiran |   (  Updated:2026-01-12 13:12:49  IST  )

ఎల్లువొచ్చి గోదారమ్మ అనే పాత పాట‌ను దీని కోసం వాడుకున్నారు. ఇందులో ఓ అందాల తార‌తో క‌మెడీయ‌న్ స‌త్య స్టెప్పులు వేశాడు.

BMW: ర‌వితేజ సినిమాలో క‌మెడీయ‌న్ స‌త్య‌తో మాస్ సాంగ్‌..ఇక జాత‌రే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మాస్ మహారాజ్ రవితేజ ( Ravi Teja) లేటెస్ట్ గా నటించిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి ( Bhartha Mahasayulaku Wignyapthi). సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. అంటే రేపు థియేటర్లలో ఈ సినిమా ఆడనుంది. రవితేజ హీరోగా చేసిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ , డింపుల్ హయాతి హీరోయిన్ గా మెరువనున్నారు. కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్, సునీల్ కూడా నటిస్తున్నారు. కిషోర్ తిరుమల ( Kishore Tirumala ) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఉన్నారు. భీమ్స్ సంగీత స్వరాలు అందించారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాటలు యూట్యూబ్ లో షేక్ చేస్తున్నాయి. అటు దర్శకుడు తిరుమల కిషోర్, ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులు కూడా వేస్తున్నారు. అయితే ఇంకా అయిపోలేదు... మా సినిమాలో మరింత ఉంది అంటూ మరో షాకింగ్ ప్రకటన చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో కమెడియన్ సత్యతో స్పెషల్ సాంగ్ చేయించారు. ఎల్లువొచ్చి గోదారమ్మ అనే పాత పాట‌ను దీని కోసం వాడుకున్నారు. ఇందులో ఓ అందాల తార‌తో క‌మెడీయ‌న్ స‌త్య స్టెప్పులు వేశాడు. ఈ వీడియో వైర‌ల్ గా మారింది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు రోజు ఈ ప్ర‌క‌ట‌న చేసి, సినిమా హైప్ పెంచారు.


Next Story