- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mamta Mohandas: పట్టు చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న క్యూట్ హీరోయిన్
పట్టు చీరలో కుందనపు బొమ్మలా మెరిసిన మమత మోహన్ దాస్

దిశ, వెబ్ డెస్క్: గాయనిగా, నటిగా గుర్తింపును సంపాదించుకున్న అతి కొద్ది మందిలో మమత మోహన్ దాస్ ఒకరు. ఈమె కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు పాటలు పాడి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటివరకు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన యమదొంగ చిత్రం ద్వారా ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీ మంచి విజయం సాధించడం, అలాగే ఇందులో ఈ బ్యూటీ తన నటనతో పాటు అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో నటిగా కూడా ఈమెకు మంచి క్రేజ్ దక్కింది. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. ఇటీవల కాలంలో ఈమె సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు.
ఆఖరుగా విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన మహారాజా చిత్రంలో ఈమె ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్దగా పలకరించకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
అందులో ఈ హీరోయిన్ లేత గులాబీ, ఎరుపు మరియు బంగారు రంగుల అంచు కలిగిన పట్టు చీరను ధరించి, భారీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఎరుపు రంగు బ్లౌజ్‌లో మెరిసింది. అలాగే మెడలో ఆకుపచ్చ రాళ్లతో కూడిన నెక్లెస్, చెవులకు చిన్న చెవిపోగులు, చేతులకు ఉంగరాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక జుట్టును వెనుకకు ఎంతో ఆకర్షణీయంగా ముడి వేసుకుని, అందులో పూలను అలంకరించుకుని అందమైన స్మైల్‌తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈమె కుందనపు బొమ్మలా మెరిసిపోతూ కనిపించడంతో, ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






