- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జబర్దస్త్ షో గురించి ఓపెన్ అయిన యాంకర్ సౌమ్య రావు
యాంకర్ సౌమ్య మాట్లాడుతూ... తాను జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి హైపర్ ఆది కారణమని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ టెలివిజన్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సౌమ్య రావు ఒకరు. ఈమె ఈ కామెడీ షోకు దాదాపు ఏడాదిన్నర పాటు యాంకర్‌గా వ్యవహరించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీంతో ఈమె ఇదే షోలో కొనసాగుతుందని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా సౌమ్య ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో, ఎందుకు వెళ్లిపోయింది అనే విషయంలో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా సౌమ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, జబర్దస్త్ కార్యక్రమం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. సౌమ్య రావు మాట్లాడుతూ... తాను కన్నడ అమ్మాయి అని, కర్ణాటక సినీ పరిశ్రమ నుంచి తెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.
మొదట్లో తనకు తెలుగు భాషపై పెద్దగా పట్టులేదని, సీరియల్స్ చేస్తున్న సమయంలో కూడా భాష సమస్య ఎదురైనట్లు చెప్పింది. అలాంటి సమయంలోనే తనకు జబర్దస్త్ షోలో యాంకర్‌గా అవకాశం వచ్చినట్లు వెల్లడించింది. అయితే యాంకర్ అంటే స్పష్టంగా తెలుగు మాట్లాడాల్సి ఉంటుందని, ఎంతోమంది ప్రేక్షకులు ఆ షోను చూస్తారని భావించి మొదట్లో తాను భయపడినట్లు తెలిపింది. కానీ తరువాత క్రమంగా తెలుగు భాషను మెరుగుపరుచుకుని, ప్రేక్షకుల ఆదరణను పొందగలిగానని చెప్పింది. ఇక తాను జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి హైపర్ ఆది కారణమని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. హైపర్ ఆది తనకు ఎంతో సపోర్ట్ చేశారని, తాను మంచిగా యాంకరింగ్ చేస్తున్న సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా తనను సిఫార్సు చేసినట్లు వెల్లడించింది. తాను జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి ఎవరూ కారణం కాదని సౌమ్య రావు స్పష్టం చేసింది.






