ఇండస్ట్రీలో మరో విషాదం.. హోటల్ లోనే ప్రముఖ నటుడు మృతి..!

by velandi.Saikiran |   (  Updated:2025-08-02 03:06:24  IST  )

సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖులు మృతి

ఇండస్ట్రీలో మరో విషాదం.. హోటల్ లోనే ప్రముఖ నటుడు మృతి..!
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖులు మృతి చెందారు. ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటికే చాలామంది కోట శ్రీనివాసరావు, ఫిష్ వెంకట్ లాంటి ప్రముఖ నటీనటులను కోల్పోయిన ఇండస్ట్రీ... మరో నటున్ని కోల్పోయింది. తాజాగా మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

ప్రముఖ మలయాళ నటుడు , మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్ ( Kalabhavan Navas) మృతి చెందారు. 51 సంవత్సరాల కళాభవన్.. నిన్న అర్ధరాత్రి మృతి చెందినట్లు చెబుతున్నారు. చొట్టా నిక్కరలోని ఓ ప్రముఖ హోటల్ లో ఆయన మృతి చెందినట్లు చెబుతున్నారు. మూవీ షూటింగ్ కోసం హోటల్ లో కళాభవన్ బస చేశారట.

అయితే నిన్న ఏమైందో తెలియదు కానీ అపస్మారక స్థితిలో ఆయన కనిపించారు. దీంతో కళాభవన్ ను ఆసుపత్రికి తరలించింది చిత్ర బృందం. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెపోటుతో నటుడు కళాభవన్ మృతిచెందినట్లు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు ప్రముఖ మలయాల నటుడు కళాభవన్ మృతి నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలు సంతాపం తెలుపుతున్నారు.


Also Read..

ఐశ్వర్యా రాయ్ నా తల్లి.. ఆధారాలతో సహా బయటపెట్టి.. బాంబ్ పేల్చిన ఏపీ కుర్రాడు..

Next Story