ఐశ్వర్యా రాయ్ నా తల్లి.. ఆధారాలతో సహా బయటపెట్టి.. బాంబ్ పేల్చిన ఏపీ కుర్రాడు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-02 02:43:22  IST  )

అందాల భామ ఐశ్వర్యా రాయ్.. అభిషేక్ బచ్చన్‌‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఆరాధ్య పుట్టింది. ప్రస్తుతం ఇద్దరు కూడా ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ బిజీగా ఉన్నారు. ఆరాధ్యను తమ మార్క్ ఉండేలా పెంచుతున్నారు. కానీ

ఐశ్వర్యా రాయ్ నా తల్లి.. ఆధారాలతో సహా బయటపెట్టి.. బాంబ్ పేల్చిన ఏపీ కుర్రాడు..
X

దిశ, వెబ్ డెస్క్ : అందాల భామ ఐశ్వర్యా రాయ్.. అభిషేక్ బచ్చన్‌‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఆరాధ్య పుట్టింది. ప్రస్తుతం ఇద్దరు కూడా ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ బిజీగా ఉన్నారు. ఆరాధ్యను తమ మార్క్ ఉండేలా పెంచుతున్నారు. కానీ ఈ మధ్య వీరిద్దరికి విడాకులు అనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో బాంబ్ పేల్చాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుర్రాడు.

అవును.. తానే ఐశ్వర్యా రాయ్ కుమారుడిని అంటూ ఏపీకి చెందిన కుర్రాడు సంగీత్ కుమార్ మీడియా ముందుకు వచ్చాడు. తన ఫోన్‌లో ఫొటోలను చూపిస్తూ ఇవే ఆధారాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఐశ్వర్య పదిహేనేళ్లు ఉన్నప్పుడే తనకు జన్మనిచ్చిందని.. లండన్‌లో ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా తనను కన్నదని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కాదు.. ఆగస్ట్ ఫస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు జనాలు. ఇలాంటి వాళ్లు ఎక్కడి నుంచి వస్తారో.. పాపం ఐశ్వర్యకు తెలుసో లేదో ఆమెకో పిల్లాడు ఉన్నాడని నవ్వుకుంటున్నారు.

Also Read : పెళ్లి కాకుండానే బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన హీరోయిన్..చాలా హ్యాపీగా ఉందంటూ పోస్ట్..?

Next Story