పెళ్లి కాకుండానే బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన హీరోయిన్..చాలా హ్యాపీగా ఉందంటూ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by I. Sairam |

యంగ్ హీరోయిన్ ఆదాశర్మ(Adah Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పెళ్లి కాకుండానే బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన హీరోయిన్..చాలా హ్యాపీగా ఉందంటూ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ ఆదాశర్మ(Adah Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘హార్ట్ ఎటాక్’(Heart Attack) మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ చిన్నది తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’(S%O Satyamurthy) మూవీలో నటించింది. అయితే స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. దీంతో బాలీవుడ్‌కి చెక్కెసి అక్కడ వరుస సినిమాల్ల నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. అలాగే నిత్యం సోషల్(Social Media) మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా ఆదాశర్మ తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో తాను నటించిన ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story) మూవీకు రెండు జాతీయ అవార్డులు వచ్చిన సందర్భంగా ఆ సినిమాలోని కొన్ని ఫొటోస్‌ను షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ క్యాప్షన్ జోడించింది. ‘#TheKerlaStory కి 2 జాతీయ అవార్డులు వచ్చాయి. దీనికి సుదీప్తో సర్ విపుల్ సర్ అండ్ ప్రశాంతను సర్‌లే కారణం. ఇక మా సినిమాను చూసి, ఏడ్చి, ట్రోల్ చేసి, చర్చించి, మాకు చాలా ప్యార్ ఇచ్చి, ది కేరళ స్టోరీని భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిపినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు.

ఇస్ బాత్ పే, ఈ సినిమాకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క దోసె (వాస్తవంగా ప్రస్తుతానికి) నేను రుణపడి ఉన్నాను(దోస ఎమోజి దొరకడం లేదు)’ అని రాసుకొచ్చింది. అయితే అందులో ఆమె ఈ మూవీలో ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫొటోలుకూడా షేర్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది ఇక దీన్నిచూసిన నెటిజన్లు ఈ సినిమాకు రెండు జాతీయ అవార్డులు రావడంతో ఈ ముద్దుగుమ్మకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story