సందీప్ కిషన్ యాక్షన్ అడ్వెంచర్ ‘సిగ్మా’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-29 06:27:39  IST  )

మూవీ మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

సందీప్ కిషన్ యాక్షన్ అడ్వెంచర్ ‘సిగ్మా’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న సరికొత్త యాక్షన్ అడ్వెంచర్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సిగ్మా’. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇందులో సందీప్ కిషన్ సరసన 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో గ్లామరస్ బ్యూటీ కేథరీన్ థ్రెసా ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ క్రమంలోనే.. మూవీ మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రేజీ యాక్షన్ అడ్వెంచర్ మూవీని జూలై 31న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అంతేకాకుండా సందీప్ కిషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసి హైప్ క్రియేట్ చేశారు. ఇందులో ఆయన రక్తం కారుతున్న పారను పట్టుకుని ఆగ్రహంతో కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. బాక్సాఫీసు వద్ద సందీప్ మాస్ యాక్షన్ యాక్షన్స్‌తో చరిత్ర సృష్టించబోతున్నట్లు అర్థమవుతోంది. ఒకవైపు సందీప్ కిషన్ మార్క్ కామెడీ, యాక్షన్.. మరోవైపు విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్ కావడంతో ఈ ‘సిగ్మా’ సినిమాపై అటు టాలీవుడ్‌తో పాటు ఇటు కోలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌తో చేతులు కలిపిన విజయ్ దేవరకొండ

Next Story