- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌తో చేతులు కలిపిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి మరియు రౌడీ జనార్ధన సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన శౌర్యవ్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇలా ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తూ మరో సినిమాకు కూడా అంగీకారం తెలిపిన ఈ యువ నటుడు, ఇప్పుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విక్రమ్ కె కుమార్ ఒక కథను విజయ్ దేవరకొండకు వినిపించగా, అది ఆయనకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్టును తొలుత యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆ బ్యానర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇక తాజాగా విజయ్ దేవరకొండ మరియు విక్రమ్ కె కుమార్ ఇద్దరూ కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్ కార్యాలయంలో కనిపించడంతో, ఈ ప్రాజెక్టును ఆ సంస్థ నిర్మించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ – విక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఫైనల్ అయితే అది ఏ బ్యానర్‌లో తెరకెక్కుతుంది అన్నది ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






