పెద్ది వల్ల మహేష్ బాబు – వెంకటేష్‌కి కష్టాలు

by Pulgam srinivas |   (  Updated:2026-05-03 10:42:09  IST  )

పెద్ది సినిమా విడుదల తేదీ ప్రభావంతో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన రావ్ బహదూర్ చిత్రం కాస్త కష్టాల్లో పడినట్లు తెలుస్తోంది.

పెద్ది వల్ల మహేష్ బాబు – వెంకటేష్‌కి కష్టాలు
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఆకస్మిక విడుదల ప్రకటనతో మరో సినిమా ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏదంటే… సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన రావు బహదూర్. ఈ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేయాలని మేకర్స్ మొదట ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ పెద్ది వంటి భారీ సినిమా జూన్ 4న విడుదలవుతుండటంతో ఎక్కువ థియేటర్లు ఆ సినిమాకే వెళ్లే అవకాశం ఉంది. దీంతో రావు బహదూర్ చిత్రానికి తక్కువ థియేటర్లు దొరికే పరిస్థితి ఏర్పడవచ్చు.

ఒకవేళ సినిమాకు మంచి టాక్ వచ్చినా థియేటర్ల కొరత వల్ల కలెక్షన్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని భావించిన మేకర్స్ విడుదల తేదీని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రావు బహదూర్ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మిస్తుండగా, వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఇలా పెద్ది సినిమా విడుదల ప్రభావంతో మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం కాస్త క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఆదర్శ కుటుంబం నుండి అదిరిపోయే అప్‌డేట్.. జెట్ స్పీడ్‌లో త్రివిక్రమ్

Next Story