Kriti Sanon about Prabhas :ప్రభాస్‌పై కృతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీరిపై వస్తున్న రూమర్స్ నిజమే..!

by Chukka Sudharani |   (  Updated:2023-06-14 15:39:52  IST  )

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదిపురుష్’.

Kriti Sanon about Prabhas  :ప్రభాస్‌పై కృతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీరిపై వస్తున్న రూమర్స్ నిజమే..!
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంటో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి.. ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కృతి మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్‌తో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన తొందరగా ఎవరితోను కలవరని నేను విన్నాను. ఆయనకు మొహమాటం ఎక్కువ. కానీ, మాట కలిపితే మాత్రం వెంటనే కలిసిపోతారు. నేను నటించిన మొదటి సినిమా గురించి ప్రభాస్‌కు చెప్పాను. ఆ తర్వాత ఆయన నాతో మాట్లాడటం మొదలు పెట్టారు. ఎదుటి వారికి ఎంతో గౌరవం ఇస్తారు. అంతే కాదు తన కళ్లతోనే మనసులోని భావాలను వ్యక్తం చేయగలడు’’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అంతా బాగా అర్థం చేసుకుందంటే వచ్చే రూమర్స్ నిజనేయో అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Read more: Adipurush :‘ఆదిపురుష్’ కొంపముంచిన విజువల్ ఎఫెక్ట్స్.

Next Story