హరిహర వీరమల్లు సినిమాపై క్రిష్ జాగర్లమూడి ట్వీట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-22 03:53:06  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.

హరిహర వీరమల్లు సినిమాపై క్రిష్ జాగర్లమూడి ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని దాదాపు 50 శాతం షూటింగ్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) పూర్తి చేసిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో విడుదల ఉండగా.. సోషల్ మీడియా వేదికగా క్రిష్ ఆసక్తికర ట్వీట్ పెట్టారు.

‘‘హరిహర వీరమల్లు సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. నిశ్శబ్దంగా కాదు.. ఒక బలమైన సంకల్పంతో రాబోతోంది. ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా ఇది సాధ్యమైంది.. సినిమాలోనే కాదు, ఆత్మలోనూ మన పవన్ కళ్యాణ్ అసాధారణ శక్తి. ఆయనలో ఏ కెమెరా పూర్తిగా గ్రహించలేని ఒక అగ్ని ఉంది. ఆయన నిత్యం మండే స్ఫూర్తి. అదే హరిహర వీరమల్లుకి ప్రాణం పోసింది. ఆయనే సినిమాకు వెన్నెముక, ఆత్మ. నిర్మాత ఏఎం రత్నం ఒక గొప్ప శిల్పి. ఎన్ని కఠిన పరిస్థితులను అయినా తట్టుకోగల ధైర్యం ఉన్న వ్యక్తి. ఆయన గొప్ప సంకల్పం అందరికీ స్ఫూర్తిని ఇచ్చింది. ఈ సినిమాకు నాకు చాలా ప్రత్యేకం. గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని క్రిష్ పేర్కొన్నారు.

Read More..

హరిహర వీరమల్లు మూవీ కోసం ఏపీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

Next Story