- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను.. షాకింగ్ పోస్ట్ షేర్ చేసిన కిరణ్ అబ్బవరం
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చాడు హీరో.

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘బేబీ’ వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన దర్శకుడు సాయి రాజేష్ కథ అందిస్తున్న ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్‌తో కలిసి సాయి రాజేష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ మధ్య కెమిస్ట్రీ వెండితెరపై సరికొత్తగా ఉండనున్నట్లు రిలీజ్ చేసిన అప్డేట్స్‌తో అర్థం అవుతుంది. ఇక ఇప్పటికే మ్యూజికల్ జర్ని స్టార్ట్ చేసిన చిత్ర బృందం ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి.. మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఓ క్యూట్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను... నిన్ను వదిలి వెళ్లాలనే ఆలోచనే నాకు ఎప్పటికీ రాదు.. ‘వదలనే’ సాంగ్ 25వ తేదీ, సాయంత్రం 6 గంటలకు రాబోతున్నది’ అంటూ ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ మంచి స్పందన సొంతం చేసుకుంటుంది. కాగా.. ఈ మూవీని మొదట సమ్మర్ టార్గెట్‌గా తెరకెక్కించే ప్లాన్‌లో ఉండగా.. ఇప్పటి వరకు ఎటువంటి రిలీజ్ అప్డేడ్ రాకపోవడంతో ఈ సినిమా ఇప్పటిలో ఉండదనే అనిపిస్తుంది. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది.






