‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాపై ట్రైలర్‌తో మరింత హైప్..

by Chukka Sudharani |   (  Updated:2026-05-23 15:47:58  IST  )

‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ ట్రైలర్ రిలీజ్ చేసింది యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.

‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాపై ట్రైలర్‌తో మరింత హైప్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్లు మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. వ‌రుణ్ ధావ‌న్ తండ్రి, దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది మృణాల్ ఠాకూర్. కోర్టు సీన్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో.. వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్ భార్యాభర్తలుగా నటిస్తుండగా, వరుణ్‌కు పిల్లలు కావాలని, కానీ మృణాల్ దానికి సిద్ధంగా లేకపోవడంతో వారు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిన వరుణ్ ధావన్, అక్కడ పూజా హెగ్డేను కలుసుకుని ప్రేమలో పడతాడు. అయితే ఊహించని విధంగా అటు మృణాల్ ఠాకూర్, ఇటు పూజా హెగ్డే ఇద్దరూ ఒకేసారి ప్రెగ్నెంట్ కావడంతో కథలో పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఇలా ఇద్దరు మహిళల మధ్య ఇరుక్కుపోయిన వరుణ్ ధావన్, ఆ నిజం బయటపడకుండా మేనేజ్ చేస్తూ ఎలాంటి అబద్ధాలు ఆడాడు, ఎలాంటి గందరగోళ పరిస్థితులను ఎదుర్కొన్నాడు చాలా వినోదాత్మకంగా ట్రైలర్ కట్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లోనే మొత్తం కథ అర్థం అవుతుండగా.. సినిమా సూపర్ హిట్ అవుతుందంటూ కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ట్రైలర్ చూసిన డైరెక్టర్ (వరుణ్ ధావన్ తండ్రి) డేవిడ్ ధావన్ ఎమోషనల్ అవ్వడం కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో మనీష్ పాల్, చుంకీ పాండే, జిమ్మీ షెర్గిల్, మౌని రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమేష్ తౌరానీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆయన కళ్లు అంటే నాకు ఇష్టం.. టాలీవుడ్ స్టార్ హీరోపై అవికాగోర్ ప్రశంసలు

Next Story